'మనసుకు నచ్చింది' అంటూ కోటి ఆశలతో తెలుగు తెరపైకి వచ్చిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. కానీ, తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా తెరపై అమ్మడిని ఆదిరించినంతగా వెండి తెరపై ఆదరించలేకపోయారు. కారణాలేమైనా కానీ, రెండే రెండు తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. దాంతో పాటు, సౌత్‌నీ వదిలిపెట్టలేదు. తెలుగు తంబీలు ఛాన్సివ్వకపోయినా, తమిళ తంబీలు బాగానే ఛాన్సిస్తున్నారీ అందాల భామకి. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న అమైరా దస్తూర్, హిందీలో 'మేడ్ ఇన్ చైనా' సినిమాలో నటిస్తోంది.
'ప్రస్థానం' రీమేక్‌తోనూ, 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాతోనూ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవకాశమొస్తే, తెలుగు సినిమాల్నీ వదిలి పెట్టనంటోంది. నెట్టింట్లో యమా యాక్టివ్‌గా కనిపించే ఈ బ్యూటీ ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకుని లేటెస్ట్‌గా ఓ పిక్ పోస్ట్ చేసింది. అసలే అందాల బుట్ట బొమ్మ. ఎక్స్‌పోజింగ్‌లో పాపకి ఎప్పుడూ మొహమాటాల్లేవ్ అనుకోండి. ఇక బ్లూ అండ్ బ్లాక్ ప్యాటర్న్‌లో ఓ డిఫరెంట్ కాస్ట్యూమ్ ధరించి సిగ్గులొలికే బిల్డప్‌లో ఓ పోజిచ్చింది. బ్లాక్ కలర్‌లో ధరించిన ఇన్నర్ వేర్ డీప్ నెక్ కావడంతో అమ్మడి హాట్ హాట్ సొగసులు సిగ్గుపడకుండానే చిందులేస్తున్నాయి. మెడలో ధరించిన దొంతి గొలుసులు ఆ వేడి సొగసులకు అదనపు వన్నెలద్దుతున్నట్లున్నాయి.