'అల వైకుంఠపురములో' ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఓ టీజర్, రెండు పాటలూ బయటకు వచ్చాయి. రేపు.. అంటే గురువారం మరో పాట విడుదల కాబోతోంది. ఈ పాటకు ఓ స్పెషాలిటీ ఉంది.. ఈ పాట టీజర్లో అల్లు అర్జున్ సుపుత్రుడు అయాన్ కూడా కనిపించబోతున్నాడు. 'డాడీ డాడీ' అంటూ సాగే పాట ఇది. ర్యాప్ స్టైల్‌లో ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోలో అయాన్ కనిపిస్తాడు. సినిమాలో మాత్రం ఉండడు.
OMG Daddy song Teaser Out Tomorrow on Children’s Day . Special sweet surprise for all the fans tomorrow. #OMGDaddy #alavaikunthapurramuloo pic.twitter.com/bQPp6fsN02
— Allu Arjun (@alluarjun) November 13, 2019
`అలా వైకుంఠపురములో` పాటలన్నీ ఓ కొత్త స్టైల్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పాటకో ప్రత్యేకంగా సెట్ వేసి, మేకింగ్ వీడియోలా చేసి, సింగర్స్ ని తీసుకొచ్చి - ఇలా హడావుడి చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి అయాన్‌ని తీసుకొచ్చారు. బన్నీనీ, సన్నాఫ్ బన్నీనీ ఒకేసారి ఫ్రేమ్‌లో చూస్తే భలే బాగుంటుంది. అందుకే మేకింగ్ వీడియో కోసం మెగా అభిమానులంతా వెయిటింగ్.