'మనసుకు నచ్చిన' అందం అమైరా సొంతం. ఆమె అందానికి ఎంతటి వారైనా ఇట్టే పడిపోవల్సిందే. కానీ అన్నీ ఉన్నా, అసలు దానికే కరువు.. అన్నట్లుగా తెలుగులో ఈ అందాల భామకి సరైన గుర్తింపు దక్కడం లేదు. కేవలం రెండే రెండు సినిమాలకు పరిమితమైంది. 'మనసుకు నచ్చింది' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, 'రాజుగాడు' సినిమాతో సరిపెట్టుకుంది. తమిళ తంబీలకు కూడా ఈ అందగత్తె పరిచయమే. ధనుష్ హీరోగా అప్పుడెప్పుడో 'అనేగన్' సినిమాలో నటించింది. ప్రస్తుతం మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ఇటీవల 'జడ్జిమెంటల్ హై క్యా', 'ప్రస్థానం' సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది.
'మేడ్ ఇన్ చైనా' సినిమాలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాని వేడెక్కించడంలో అమైరా దస్తూర్‌ది అందె వేసిన చేయి. డిఫరెంట్ డిఫరెంట్ హాట్ ఫోటో సెషన్లు, హాట్ అండ్ ఫిట్ యోగా ట్రీట్‌లు ఇలా ఒక్కటేమిటి.. చాలానే చేస్తుంటుంది. ఆ హాట్ ట్రీట్స్‌కే అమైరాకి నెట్టింటి నిండా బోలెడంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తాజాగా తన ఫాలోవర్స్ కోసం ఓ హాట్ ట్రీట్ ఇచ్చింది అమైరా దస్తూర్. టోన్డ్ జీన్స్, విత్ వైట్ స్లీవ్‌లెస్ టాప్‌లో అమాయకంగా నేలపై కూర్చొని చూస్తోంది. అందాల ఆయుధాన్ని అంతంత మాత్రంగానే విడిచినా, పిక్ మాత్రం సింప్లీ సూపర్స్. అందుకే రెస్పాన్స్ కూడా అదే రేంజ్‌లో వస్తోంది.