స్టైలిష్ పోజులో కిర్రాక్ లుక్స్‌తో కవ్విస్తోన్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా.? పేరు పాయల్ ఘోష్. ఎన్టీఆర్ - తమన్నా జంటగా నటించిన 'ఊసరవెల్లి' చిత్రంలో తమన్నా ఫ్రెండ్ రోల్ పోషించింది కదా.. అదేనండీ 'చిత్ర'. ఈ సినిమాలో తమన్నా పాత్ర పేరు గుర్తు లేకున్నా, ఈ చిత్ర పేరు మాత్రం బాగా గుర్తుండిపోతుంది అందరికీ. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ.
అంతకు ముందే, మంచు మనోజ్‌తో 'ప్రయాణం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇదిగో ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ పోజుకి ఫిదా అయిన నెటిజన్లు.. అయ్యో ఈ అందాన్ని ఎవరూ ఎందుకు గుర్తించడం లేదే.? అని వాపోతున్నారు. ఫేస్‌లో క్యూట్‌నెస్ అలరిస్తోంది. ఆ నడుము మడతలు చూస్తున్నారుగా, కవ్విస్తున్నాయ్. మరింకెందుకు, ఈ వంపు సొంపుల ఊసరవెల్లికి ఇంకొక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే పోలా.!