క్యూట్ ఫీచర్స్‌తో కట్టి పడేసే అందం ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌ది. మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మనసుకు నచ్చింది' సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమో సాంగ్స్ వీడియోల్లో అమ్మడి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదమైన లొకేషన్స్‌తో ఈ బ్యూటీ అందచందాలు పోటీ పడుతున్నాయంటే నమ్మి తీరాల్సిందే. అంతటి అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. చూశారుగా ఈ ఫోటోలో పచ్చని చెట్లు, చెట్ల చాటున ఈ బ్యూటీ సొగసు ఎలా మెరిసిపోతోందో. అదే అమైరా గ్లామర్ స్పెషాలిటీ. మరో పక్క యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు' సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. ఇంటర్నేషనల్ మూవీ అయిన 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో అమైరా, జాకీచాన్‌తో జత కట్టింది.
ALSO SEE :
Qlik Here For The Gallery