టూ పీస్ బికినీలో అదరగొట్టేసినా, అందమైన చీరకట్టుతో అలరించినా 'నేచురల్ బ్యూటీ'గా అమైరా దస్తుర్ తనదైన స్పెషాలిటీని చాటుకుంది. ఈ బ్యూటీ తెలుగులో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. 'రాజుగాడు' సినిమాలో రాజ్‌తరుణ్ సరసన నటిస్తోన్న అమైరా, సందీప్ కిషన్‌తో 'మనసుకు నచ్చింది' సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలకు కమిట్ అయ్యింది అమైరా. తెలుగు తెరపై తొలి సినిమాలోనే అటు నటనతోనూ, ఇటు గ్లామర్‌తోనూ సత్తా చాటుతానంటోంది. ఇదిగో ఈ స్టిల్స్ చూస్తోంటే అర్థం అవుతోంది. అందం ప్లస్ అభినయం కలగలిస్తే అమైరా దస్తుర్ అన్నట్టుంది కదూ! 'మనసుకు నచ్చింది' ప్రోమోస్‌లో అమైరా నేచురల్ బ్యూటీని దర్శకురాలు మంజుల బాగా క్యాప్చర్ చేసినట్లే వుంది. 'రాజుగాడు' సినిమాలోనూ గ్లామర్ విషయంలో ఈ బ్యూటీ ఎక్కడా రాజీ పడలేదట.