అహో.! దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది కదూ. కాస్సేపు గ్లామర్ సంగతి పక్కన పెడితే, ఆమె అందం చూపు తిప్పుకోనీయకుండా చేసేస్తోంది. అందాల అమైరాదస్తూర్ ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలనుకుంటుంది. అందుకే ఆమె ఫోటోసెషన్స్ని సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్. యోగా ఫీట్లు వేసినా, గ్లామర్ అప్పీల్ చూపించినా ఏం చేసినా ఆమె స్టైలే వేరు.
అందుకే ఆమె స్టైల్‌కీ, అందానికి అంతలా ఫిదా అయిపోయేది. చూస్తున్నారుగా, టమేటో రెడ్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్లోని ఈ నిండైన కాస్ట్యూమ్‌లో ఒంటి నిండా నగలు ధరించి అందమైన దేవకన్యలా మెరిసిపోతోంది అమైరాదస్తూర్. తెలుగులో 'మనసుకు నచ్చింది', 'రాజుగాడు' చిత్రాల్లో నటించిన అమైరా దస్తూర్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. కాస్త టైం దొరికినా ఇదిగో ఇలా అభిమానుల కోసం సోషల్ మీడియాలో గ్లామర్‌తో జిగేల్మంటుంది.