బిగ్‌బాస్ రియాల్టీ షో క్లైమాక్స్‌కి చేరుకుంది. టాప్ 5లో ఎవరుంటారన్న క్లారిటీ సంగతి పక్కన పెడితే, హౌస్‌లో ప్రస్తుతం ఉన్న ఆరుగురు సభ్యుల్లో కౌషల్ ఒక్కడూ ఒకవైపు. మిగిలిన ఐదుగురూ ఒకవైపు నిలుస్తున్నారు. కౌషల్‌ని టార్గెట్ చేస్తూ, ఒంటరిని చేస్తూ బ్లేమ్ అండ్ ఫేక్ గేమ్ ఆడుతున్నారు మిగిలిన కంటెస్టెంట్స్. ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్‌లో కూడా ఇదే జరిగింది.
గౌతమ్ గులాటీ అనే హౌస్‌మేట్‌ని టార్గెట్ చేశారు మిగిలిన హౌస్ మేట్స్. అప్పుడు హోస్ట్ సల్మాన్‌ఖాన్ చాకచక్యంగా వ్యవహరించాడు. వాస్తవానికి హోస్ట్‌కి హౌస్‌లోని హౌస్ మేట్స్ అంతా సమానమే అయినప్పటికీ, ఒంటరిగా మిగిలిపోయిన గౌతమ్ గులాటీ తరపున మాట్లాడి అతనికి అండగా నిలబడ్డాడు సల్మాన్.
ఇప్పుడు నాని పరిస్థితి కూడా ఇదే. కౌషల్ తరపున నాని మాట్లాడాల్సి వుంది. హౌస్‌మేట్స్ ప్రవర్తిస్తున్న తీరు గేమ్‌లో భాగమే అయినా కానీ, ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆయన మానసిక స్ధైర్యాన్ని లొంగదీయడమనేది మానవీయ చర్య కాదు. హౌస్‌లో ఏం జరుగుతోంది? ఎలా జరుగుతోంది? ఆ వ్యక్తిని ఎలా టార్గెట్ చేస్తున్నారు? ఎలా బ్లేమ్ చేస్తున్నారు? అనేది ప్రేక్షకులు చూస్తున్నారు. ఫైనల్ లెవల్ కోసం జరిగిన ఇసుక టాస్క్, గుడ్ల టాస్క్‌ల్లో కౌషల్‌కి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు.
బిగ్‌బాస్ కూడా హౌస్‌లోని చర్యల్ని చూసీ చూడకుండా వదలేయడం, ఫేక్ గేమ్‌లో విన్నర్స్‌ని ప్రకటించడం వీక్షకుల్ని మరింత విస్తుపోయేలా చేసింది. ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌లో కౌషల్ వెర్సస్ మిగిలిన హౌస్‌మేట్స్ పట్ల నాని వ్యవహారశైలి ఎలా ఉండనుంది? టాస్క్‌ల విషయమై నాని ఎవరిని ఎలా నిలదీస్తాడు.? టాస్క్‌ల్లో వారు చేసిన తప్పుల్ని ఎలా ఎత్తి చూపిస్తాడు.? అనేది చూడాలిక.