‘మనసుకు నచ్చింది’ సినిమాతో టాలీవుడ్‌కి క్యూట్‌గా హాయ్ చెప్పిన అమైరా దస్తూర్, ఆ తర్వాత ‘రాజుగాడు’ తదితర చిత్రాల్లో నటించినా ఓ మోస్తరు ఫేమ్ కూడా సంపాదించుకోలేకపోయింది. కానీ, సోషల్ మీడియాలో ఫిట్నెస్ వీడియోలతో హాట్ హాట్ పిక్స్ తో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది. అయితే నెట్టింట్లో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే అమైరా దస్తూర్ ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకోవడంతో పాపం ఈమె ఫాలోవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారట. అందుకే అలాంటి వారి కోసం రీసెంట్గా కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. రాయల్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఫోటోలకు పోజిచ్చింది. రాయల్ బ్లూ కదా.. అమైరా గ్లామర్ కూడా రాయల్‌గానే మెరిసిపోతోంది.
అసలే గ్లామ్ షూట్స్‌లో అమైరాది అందె వేసిన చేయి. గ్యాప్ వచ్చినా, గ్లామర్ ఏమాత్రం మిస్ కాలేదు. అప్పర్ వ్యూ కావడంతో ఘాటు ఘాటు అందాలు డీప్ లెవల్లో దర్శనమిస్తున్నాయి. రెండు చేతుల్నీ నీలాల కురుల్లో నాట్యం చేయిస్తూ, కసి కసిగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈ ఫోటోకి హైలైట్ అయ్యింది. ఇక పాప ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ‘రాజుగాడు’ హిందీ రీమేక్‌లోనూ అమైరా హీరోయిన్గా నటిస్తోంది.