‘ముకుందా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ పూజా హెగ్దే, తొలి సినిమా తర్వాతే బాలీవుడ్‌లో ‘మొహంజోదారా’ సినిమా కోసం టాలీవుడ్‌కి బాయ్ చెప్పేసింది. అయితే, ఇక్కడ బోణీ బాగుంది కానీ, అక్కడ బోణీ కలిసి రాలేదు. దాంతో, మళ్లీ టాలీవుడ్‌కే తిరిగొచ్చింది. తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఛైర్‌పై కన్నేసింది. టార్గెట్ రీచ్ అయ్యే దిశగా వరుసగా బిగ్ ప్రాజెక్టులు చేజిక్కించుకుంది. ప్రజెంట్ తాను అనుకున్నట్లే, టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. మధ్య గ్యాప్‌లో హిందీలోనూ ఓ సినిమా కానిచ్చేసింది. అదే ‘హౌస్‌ఫుల్ 4’. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. రికార్డు స్థాయి వసూళ్లు కూడా కొల్లగొట్టింది. దాంతో, మళ్లీ హిందీ మేకర్స్ కూడా పూజా హెగ్దేపై దృస్టి పెట్టారు.
వరుస ఆఫర్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ క్రమంలో ఇప్పటికే రెండు బిగ్ ప్రాజెక్టులు పూజా హెగ్దే చేతిలో పడ్డాయి. అందులో ఒకటి అక్షయ్ కుమార్ సినిమా కాగా, మరొకటి కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్, కబీ దీవాళీ’ సినిమాలు ఉన్నాయి. అయితే, వీటిలో ఆల్రెడీ అక్షయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా, ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోందట. ఎన్నో చర్చల అనంతరం ఈ సినిమాలో తనకి ఛాన్స్ రావడం తన అదృష్టమంటోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రబాస్‌తో ‘జాన్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర్’ సినిమాల్లో పూజా హెగ్దే నటిస్తోంది.