అసలే సాయం సంధ్య వేళ.. ఇన్ని వంపులతో ఈ సుందరాంగి వయ్యారాలు పోతే ఎవరికైనా మతులు పోకుండా ఉంటుందా.. చెప్పండి. అందుకే సూర్యారావు కూడా అస్తమించాల్సిన సమయాన్ని కూడా మర్చిపోయి, అదిగో అలా ఏరిపార చూస్తుండిపోయాడు. ఇంతకీ ఈ వంపుల సుందరి ఎవరంటారా.? ఇంకెవరు అందాల అమైరా దస్తూర్. కవిత్వం తెలిసిన వారు వర్ణిస్తే ఈ అందానికి ఎన్ని అవార్డులో ఎన్ని రివార్డులో.. అయితే, ఏ కవిత్వం తెలియని వాళ్లైనా సరే, తమకొచ్చిన రీతిలో ఈ అందాన్ని అలా చూస్తూ వర్ణించకుండా ఉండలేరు.
అమ్మో ఇన్ని వంపులా.? ఏమెట్టి చేశాడో ఆ బ్రహ్మ.. వంపు సొంపల ఈ బొమ్మ.. చూశారా.. కవిత్వం ఎలా పారేస్తుందో. తెలిసిందే అనుకోండి.. అంతగా కవ్వించేస్తోంది మరి. చూశారా.. ఎన్ని 'వి' షేపులో అమైరా శరీరంలో. ఆ నడుమెంపు.. కాలి వంపు. పాదాల వంపు.. ఆమె నీడ కూడా పోత పోసినట్లే ఉంది. సాయం సంధ్యలో సూర్యం గారే ఈ అందాన్ని అలా చూస్తుండిపోయారంటే మానవ మాతృలం మనమెంత చెప్పండి.. ఈ సుందరాంగి అందాల విందుకు ముగ్ధులు కాకుండా ఉండేందుకు. ఈ అందాల భామ వయ్యారాలు తిలకిస్తూ, ప్రకృతి కూడా స్థంభించిపోయిందేమో అనిపించట్లే..!