రౌడీతో రొమాన్స్‌కి అనన్య సై సై..!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ ` పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఫైటర్‌’ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముంబయ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరిగింది. కానీ, కుదరలేదు. జాన్వీ ప్లేస్‌లో మరో బాలీవుడ్‌ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌తో అనన్యా పాండే దిగిన ఫోటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆన్‌ సెట్స్‌, టీమ్‌తో అనన్య సరదాగా కలిసి దిగిన ఫోటోలివి. రౌడీతో పాటు, డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, ప్రొడ్యూసర్‌ ఛార్మి ఈ ఫోటోస్‌లో సందడి చేస్తున్నారు.

 

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాతో ముద్దుగుమ్మ అనన్యా పాండే బాలీవుడ్‌లో పాపుర్‌ అయిన సంగతి తెలిసిందే. ‘ఫైటర్‌’ మూవీతో సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఫిజిక్‌ పరంగా పర్‌ఫెక్ట్‌ మెజర్‌మెంట్స్‌తో సౌత్‌ ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. రౌడీతో అనన్య జంట చూడ చక్కగా ఉంది కూడా. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తెలుగుతో పాటు, హిందీలోనూ ఈ సినిమా రూపొందుతోంది. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని పూరీ జగన్నాధ్‌తో కలిసి ఛార్మి నిర్మిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS