బాలయ్య అలా.. బోయపాటి ఇలా.!

మరిన్ని వార్తలు

బాలయ్య ఈ మధ్య తన సినిమాల్లో ఇద్దరిద్దరు కథానాయికులుండేలా చూసుకుంటున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’.. తదితర సినిమాల దగ్గర నుండీ, ఈ మధ్య వచ్చిన ‘రూలర్‌’ వరకూ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ ఆడిపాడుతున్నారు బాలయ్య. ఈ సారి కూడా బాలయ్య ఇద్దరు హీరోయిన్స్‌ని ప్రిఫర్‌ చేస్తున్నారట. ‘రూలర్‌’ కోసం యంగ్‌ హీరోయిన్స్‌తో ఆడిపాడిన బాలయ్య ఈ సారి సీనియర్స్‌కీ, అందులోనూ తనకు బాగా కలిసొచ్చిన ముద్దుగుమ్మలనే ఎంచుకోవానుకుంటున్నారట. వారిలో మొదటి పేరు శ్రియ అని తెలుస్తోంది.

 

శ్రియ - బాలయ్య గతంలో పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు దాదాపు సక్సెస్‌ అయ్యాయి కూడా. అలాగే నయనతార కూడా బాలయ్యకు బాగా కలిసొచ్చిన హీరోయిన్‌. ఈ ఇద్దరూ తన లేటెస్ట్‌ సినిమాలో హీరోయిన్స్‌గా కావాలని డైరెక్టర్‌ బోయపాటికి సూచిస్తున్నారట. అయితే, నయనతార తమిళంలో చాలా బిజీ. శ్రియ కూడా తనదైన బిజీ షెడ్యూల్స్‌తో ఓ మోస్తరు బిజీగానే గడుపుతోంది. ఈ సమయంలో బాలయ్య సినిమా కోసం వీరిద్దరూ వస్తారా.? అంతేకాదు, సీనియర్‌ భామల్ని తీసుకుంటే, రెమ్యునరేషన్‌ విషయంలోనూ కొంచెం గట్టిగానే ఆలోచించాలి. కానీ, ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో కొన్ని పరిమితులున్నాయని అంటున్నారు.

 

సో హీరోయిన్స్‌ విషయంలో బాలయ్య ఆలోచన అలా ఉంటే, బోయపాటి ఆలోచన మరోలా ఉందంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్స్‌ ఫైనల్‌ సెలెక్షన్‌ ఎలా జరుగుతుందో చూడాలి మరి. త్వరలోనే వారణాసిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS