శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ని టాలీవుడ్‌లోకి తీసుకురావాలని చాలామంది దర్శకులు భావించారు. కానీ... ఇప్పటి వరకూ జాన్వీ తెలుగు సినిమాపై సంతకం చేసిందే లేదు. పూరి జగన్నాథ్ సైతం.. జాన్వీని టాలీవుడ్ కి లాక్కుని రావాలని చూశాడు. `లైగర్` సినిమా కోసం విజయ్ దేవరకొండకు జోడీగా ముందు జాన్వీనే అనుకొన్నారు. చివరి క్షణం వరకూ డేట్లు సర్దుబాటు కాలేదు. దాంతో.. జాన్వీ డ్రాప్ అయ్యింది. ఆ స్థానంలో అనన్య పాండేని తీసుకోమని సలహా ఇచ్చింది... కరణ్ జోహారే అట. అనన్యకు బాలీవుడ్ లో కొంచెం క్రేజ్ ఉంది. అది కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని కరణ్ చెప్పాడట. కరణ్ సలహా మేరకే అనన్య ఈ ప్రాజెక్టులోకి వచ్చింది.
''నేను శ్రీదేవికి వీరాభిమానిని. అందుకే జాన్వీని ఎలాగైనా సరే తెలుగులోకి తీసుకురావాలనుకొన్నా. కానీ వీలు కాలేదు. అయితే... అనన్య బాగా నటించింది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా క్యూట్ గా ఇచ్చింది. తనకు తెలుగులోనూ మంచి భవిష్యత్తు ఉంది'' అని చెప్పుకొచ్చాడు పూరి.
ఈనెల 25న లైగర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లు నెల రోజుల ముందే మొదలెట్టేసింది చిత్రబృందం. ముఖ్యంగా నార్త్ లో ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారు. దాదాపుగా రూ.160 కోట్లతో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే 200 కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్.