ఎంతమంది ఫాలోవర్స్ వుంటే ఏం లాభం.? అందులోంచి వచ్చే నెగెటివిటీని తట్టుకోవాలి కదా! బుల్లితెర బ్యూటీ అనసూయకీ ఇదే సమస్య వచ్చి పడింది. ఆమె ఏదన్నా కామెంట్ చేస్తే సానుకూలంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళే కాదు, అడ్డగోలు విమర్శలతో విరుచుకుపడేవారూ వుంటారు. అలా తనను విమర్శించేవారందర్నీ ‘బ్లాక్’ చేసుకుంటూ పోతోంది అనసూయ. తన మీద నెగెటివిటీ వచ్చిన ప్రతిసారీ, ఏదో ఒక రకంగా హంగామా చేయడం ఆమెకు అలవాటే. జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తే మాత్రం అస్సలూరుకోదు అనసూయ. పోలీసులకు పలు సందర్భాల్లో ఇలాంటి విషయాలపై ఫిర్యాదు చేసింది కూడా. అలాగని, అనసూయపై జుగుప్సాకరమైన కామెంట్లు తగ్గాయా.? అంటే అదీ లేదు.
తాజాగా అనసూయ, విజయ్‌దేవరకొండ వ్యవహారంలో చేసిన కామెంట్ మళ్ళీ విమర్శలకు తావిచ్చింది. దాంతో, అనసూయపై నెగెటివిటీ పెరిగిపోయింది. చేసేది లేక, నెగెటివ్ కామెంట్లు చేస్తున్నవారందర్నీ బ్లాక్ చేయడం మొదలు పెట్టింది. ‘చాలామందిని బ్లాక్ చేశాను..’ అంటూ బ్లాక్ చేసిన వైనం గురించి చెప్పుకుంది కూడా. ‘చేస్తే చేసుకో.. మేం చెయ్యాల్సింది మేం చేస్తాం..’ అంటున్నారు సోషల్ కేటుగాళ్ళు. అవును మరి, ఓ అకౌంట్ బ్లాక్ చేస్తే, క్షణాల్లో ఇంకో అకౌంట్ ఓపెన్ చేసే వెసులుబాటు వుండనే వుంది కదా!