నెటిజన్‌కి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన రంగమ్మత్త!

మరిన్ని వార్తలు

హాట్‌ యాంకర్‌ అనసూయకు సోషల్‌ మీడియాలో ఓవర్‌ డోస్‌లో ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. నెటిజన్స్‌ నుండి పొగిడిరచుకోవడమూ, అలాగే ఘాటుగా కౌంటర్స్‌ వేయించుకోవడమూ ఆమెకు బాగా తెలుసు. అలా అని, తిరిగి కౌంటర్స్‌ వేయదనుకునేరు. తనను కామెంట్‌ చేస్తే, ఇమ్మీడియట్‌గా దిమ్మ తిరిగే కౌంటర్స్‌ విసిరి సదరు నెటిజన్స్‌ని నోరు మూయిస్తుంటుంది అనసూయ. ఇకపోతే, కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ, ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే అనసూయ, లీజర్‌గా నెటిజన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఈ క్రమంలో అనసూయపై తమకున్న డౌట్స్‌ లిస్ట్‌ అంతా నెట్టింట్లో ప్రశ్నల రూపంలో పరిచేశారు నెటిజన్లు. అలా, ఓ నెటిజన్‌.. డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మందు కొట్టి రచ్చ రచ్చ చేశారట కదా.. నిజమేనా.? అని ఓ నెటిజన్‌ అనసూయను ప్రశ్నించాడు. అప్పట్లో ఈ ఇష్యూ రచ్చ అయిన సంగతి తెలిసిందే.

 

అయితే, ప్రస్తుతం ఆ ప్రశ్నకు అనసూయ క్లారిటీ ఇవ్వలేదు సరికదా.. సదరు నెటిజన్‌కి తలంటు పోసింది. ‘నువ్వు మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా మెచ్యూర్‌ కాలేదు..’ అంటూ ఆ నెటిజన్‌ని పక్కదోవ పట్టించింది. ఇకపోతే, ఎప్పుడూ అనసూయ టాటూపైనే అందరి దృష్టి. ఈ ఛాటింగ్‌లో ఆమె చేతిపై ఉన్న టాటూకి మరోసారి అర్ధం అడిగాడు ఓ నెటిజన్‌. దానికి అర్ధం వివరిస్తూ, ‘బ్యూటీ సోల్‌ డీప్‌ (నిశ్చలమైన మనసు కలిగిన అందమైన అమ్మాయి)’ అంటూ అబ్బో అనసూయ తెగ వయ్యారాలు పోయిందిలెండి. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS