ఈ పిక్‌లోని గ్లామర్ డాల్ ని గుర్తించారా.? సిద్ధిఖా శర్మ. అప్పుడెప్పుడో నాని సరసన ‘పైసా’ సినిమాలో నటించింది. ‘మాయ మాయ..’ సాంగ్‌లో నానితో కలిసి బికినీల్లో తెగ అందాలు ఆరబోసిందిలెండి. అంత ఘాటుగా అందాలారేసినా, ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు రాలేదు ఎందుకో పాపం. చిన్న తనం నుండీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం పెంచుకున్న ఈ పోరి, ఆ ఇష్టంతోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఎలా వచ్చిందో తెలీదు కానీ, నాని ‘పైసా’లో ఛాన్స్ కొట్టింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌నెస్‌ని ఎర్ర తివాచీ వేసి పరిచేసే ఈ హాట్ బ్యూటీ లేటెస్ట్గా కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. డెనిమ్ టోన్డ్ జీన్స్‌లో పింక్ ఇన్నర్ వేర్ ధరించి, స్టైల్‌గా ఫోటోలకి పోజిచ్చింది. పిక్స్ అయితే అదిరిపోయాయంతే.
కరోనా కారణంగా గ్లామ్షూట్స్ కూడా బంద్ అయిపోయిన ఈ టైమ్‌లో ఎడారిలో ఒయాసిస్‌లా దొరికిన ఈ ఫోటోతోనే నెటిజన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ పాప ప్రస్తుతం రకుల్ సోదరుడు అమన్ ప్రీత్‌తో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.