విజయ్ దేవర కొండ లైగర్ దెబ్బకొట్టింది. వాట్ లగా దేంగే నినాదం కాస్త రివర్స్ అయ్యింది. దేశం షేక్ అవ్వడం కాదు.. లైగర్ కి పబ్లిక్ నుండి వచ్చిన దారుణమైన రెస్పాన్స్ తో యూనిట్ మొత్తం షాక్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. లైగర్ ని సోషల్ మీడియాలో ఏకిపారేశారు. అయితే ఇప్పుడా ట్రోల్స్ ఒక్కసారిగా డైవర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎవరూ లైగర్ సినిమా ఫ్లాఫ్ గురించి మాట్లాడటం లేదు. సోషల్ మీడియా పేజీలు తెరిస్తే చాలు.. 'ఆంటీ' ట్రోల్స్ నడుస్తున్నాయి. ట్విట్టర్ ఫేస్ బుక్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్.
ఇంతకీ ఈ ఆంటీ ట్రోల్స్ ఎవరిమీదో కాదు.. యాంకర్ అనసూయ మీద. లైగర్ విడుదలైన రోజు.. అనసూయ ఒక ట్వీట్ చేసింది. తల్లిని అనే కర్మ ఎవరినీ వదలదని. ఈ ట్వీట్ అర్జున్ రెడ్డి సినిమా వివాదానికి కనెక్ట్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ఇంక అనసూయని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.
దీనిపై స్పందించిన అనసూయ.. అందరి ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ తీశాను. నన్ను అంటీ అని ట్రోల్ చేసిన అందరిపై పోలీసు కేసులు వుంటాయని హెచ్చరించింది. అనసూయ చేసిన ఈ ట్వీట్ మరింత ట్రోల్స్ కి అవకాశం ఇచ్చింది. మీమర్స్ మామూలుగా కౌంటర్లు వేయడం లేదు. 37 మహిళ ఇద్దరు పిల్లలకు తల్లిని ఆంటీ అనకపొతే అమ్మాయి అనాలా ? అంటీ అనే మాటకు అరెస్ట్ చేయిస్తే.. ఈ ప్రపంచంలో వున్న పోలీసులు స్టేషన్ లు సరిపోతాయా ? అంటూ తెగ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు లైగర్ సైడ్ ట్రాక్ పట్టి.. ఆంటీ తెరపైకి వచ్చింది.