'లైగర్' జాతకం మొదటి ఆటతోనే తేలిపోయింది. అతి పెద్ద డిజాస్టర్ దిశగా వెళుతోంది లైగర్. బాలీవుడ్ లో కూడా అంతే. తెలుగులో ప్రమోషన్ల పరంగా ఏ హడావుడి లేదు. నార్త్ లో మాత్రం గట్టిగా చేశారు. సినిమాలో విజయ్ తప్పా దాదాపు బాలీవుడ్ నటులే. కానీ ఫలితం రాలేదు. అక్కడ పూర్తి నెగెఇవ్ రివ్యూలే వచ్చాయి. హిందీ క్రిటిక్స్ మరీ దారుణమైన రేటింగులు ఇచ్చారు,. మౌత్ టాక్ కూడా ఏమీ బాగా లేదు. ఈ నేపథ్యంలో హిందీలో లైగర్ ముద్ర వేయడం కష్టమే అని తేలిపోయింది.
ఇప్పుడు లైగర్ టీంకి తెలుగు గుర్తుకు వచ్చింది. నిన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళింది టీమ్. నాలుగుగైదు తెలుగు థియేటర్లు కూడా తిరగాలనే ప్లాన్ లో వుంది. మొదటి నుండి తెలుగు ప్రమోషన్స్ ని పట్టించుకోలేదు. తెలుగు టైటిల్ పోస్టర్ కూడా డిజైన్ చేయడానికి బద్దకించారు. ఇప్పుడు తెలుగు తప్పితే మరో ఆప్షన్ కనపడటం లేదు లైగర్ టీంకి. ట్విట్టర్ లో కూడా తెలుగు టైటిల్స్ పెట్టి పోస్టులు చేస్తున్నారిప్పుడు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు ఎంత చేసినా లైగర్ నిలబడే అవకాశాలు తక్కువే.