అందమే కాదు, కాస్త 'అటు' కూడా చూడమ్మా!

మరిన్ని వార్తలు

ఫ్రెష్‌ గ్లామర్‌ పిక్స్‌తో అనసూయ సోషల్‌ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. అయితే, అసలు విషయం ఎందుకో సైడేసేసింది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'కథనం' ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ విషయం ఏదో టీవీల్లో ఒకటీ అరా ప్రోమోస్‌తో తప్ప ఇంకెక్కడా సౌండే లేదు. తాను నటించిన సినిమాల్ని ప్రమోట్‌ చేయడంలో అనసూయ ఎప్పుడూ ముందే ఉంటుంది. అలాంటిది ఎందుకో 'కథనం' సినిమాని లైట్‌ తీసుకుంది.

 

ఆమె అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్థావిస్తున్నా, ఎందుకో అనసూయ అటు వైపు అస్సలు దృష్టి పెట్టడమే లేదు. అసలే సోలోగా కూడా ఎంట్రీ ఇవ్వడం లేదు అనసూయ. అదే రోజు సోగ్గాడు నాగార్జున 'మన్మధుడు 2'తో రాబోతున్నాడు. ఈ సినిమాపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసేశారు ఇప్పటికే. ఆ మాటికొస్తే, అనసూయ అడగాలే కానీ, సోగ్గాడు, అనసూయ సినిమాని సపోర్ట్‌ చేయడానికైనా వెనుకాడరు. అనసూయకున్న ఫాలోయింగ్‌, ఇండస్ట్రీలో ఆమెకున్న క్రేజ్‌తో ఈ సినిమాలో కంటెంట్‌తో సంబంధం లేకుండా, ప్రమోషన్స్‌ ఇరగదీసేయొచ్చు.

 

కానీ వీటిలో ఏ ఒక్కటీ చేయడం లేదు అనసూయ. అందుకు కారణాలు కూడా తెలిసి రావడం లేదు. హాయిగా, నెట్టింట్లో డిఫరెంట్‌ డిఫరెంట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ చేయించుకుంటూ, సినిమా ఊసే ఎత్తకుండా, ఎంజాయ్‌ చేస్తోంది అనసూయ. మరి అనసూయ స్ట్రాటజీ ఏంటో అర్ధం కావడం లేదు. ఇక సినిమా విషయానికి వస్తే, రాజేష్‌ నాదెండ్ల ఈ సినిమాకి దర్శకుడు. అవసరాల శ్రీనివాస్‌, ధన్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS