ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి బిగ్‌హౌస్‌లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వారం అనూహ్యంగా అపరిచితురాలైపోయింది తమన్నా. డిఫరెంట్ ఆటిట్యూడ్ ప్రదర్శిస్తోంది. ఆటిట్యూడ్ అనకూడదేమో కూడా దాన్ని. అసహ్యం పుట్టించేస్తోంది. తమ్ముడు, తమ్ముడు అని పిలుచుకున్న రవికృష్ణని బంతాట ఆడేస్తోంది. సరదాగా ఆట పట్టిస్తే ఫర్వాలేదు కానీ, ఆ ఆట శృతిమించిపోతోంది. ఈ వారం బిగ్ హౌస్ నుండి తమన్నాని బయటికి పంపేస్తారన్న న్యూస్ ఆల్రెడీ లీక్ అయిపోయింది.
ఇదే న్యూస్ తమన్నాకి కూడా తెలిసే ఉంటుందని ఆడియన్స్ కూడా ఓ అంచనాకి వచ్చేశారు. అందుకే ఆమె హౌస్‌లో ప్రవర్తించే తీరు ఆ రకంగా ఉందనీ, ఈ నాలుగు రోజులూ ఆమెతో మేగ్జిమమ్ రచ్చ చేయించేయాలని బిగ్‌బాస్ యూనిట్ కూడా భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆమె తన నసతో హౌస్ మేట్స్ అందరిలోనూ అసహనం క్రియేట్ చేస్తోంది. జుగుప్సాకరమైన మాటలతో స్టార్ట్ అయిన ఈ వారం తమన్నా ఎపిసోడ్, ఎంతవరకూ తీసుకెళుతుందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో ఉన్నప్పటికీ, ఆమెను భరించడం కష్టమైపోతోంది వీక్షకులకి. ఇక హౌస్‌లో ప్రస్తుతం తమన్నా బాధితుడిగా కనిపిస్తున్న రవికృష్ణ ఎన్ని రోజులని ఓపిక పడతాడో తెలీదు.
ఇప్పటికే గత రెండు రోజులుగా రవికృష్ణ సహనాన్ని పరీక్షిస్తోంది తమన్నా. కొడతావా కొట్టు.. నువ్వు మగాడివే కాదు. మగాడి రూపంలో ఉన్న ట్రాన్స్‌వి. సిగ్గు లేదు.. పప్పు.. ఇంకా రాయలేని పదాలెన్నో ప్రయోగిస్తూ, తమన్నా విసుగు పుట్టిస్తోంది. మిగిలిన హౌస్ మేట్స్ ఎంతగా ఆమెను డైవర్ట్ చేయాలని చూసినా ఆమె డైవర్ట్ కావడం లేదు. నేను హౌస్‌లో ఉన్న ఈ నాలుగు రోజులూ ఇలాగే నీతో ఆడుకుంటా.. అని చెబుతోంది. అంటే, ఈ వారం తమన్నా ఎలిమినేట్ కావడం పక్కా.!