ఆనుసుయా .. అహంకారానికి పరాకాష్ట

మరిన్ని వార్తలు

బుల్లితెర‌పై సందడి చేస్తూ, మ‌రోవైపు వెండితెర‌పై కూడా కనిపిస్తుంది అన‌సూయ. రంగ‌స్థలంలో రంగ‌మ్మత్త పాత్రతో ఒక్కసారిగా ఆమెలోని నటిని పరిచయం చేశారు సుకుమార్. రంగ‌మ్మత్త పాత్ర అనసూయ కెరీర్ లో ఓ మైల్ స్టోన్. ఇప్పుడు 'పుష్ప' లో కూడా అనసూయకి ఓ కీలక పాత్ర వుంది. ఆమె పాత్ర పేరు దాక్షయని. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రివిల్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో గుర్తుపట్టలేనంతగా వుంది ఆనుసుయా. నోట్లో కిళ్ళీ నములుతూ చేతిలో కంటింగ్ ప్లేయ్ పట్టుకొని సీరియస్ గా చూస్తున్న ఆనుసూయని చూస్తే అసలు ఈమె అనసూయానేనా? అన్న అనుమానం వచ్చేట్లు లుక్ ని డిజైన్ చేశారు.

 

'ఆమె అహంకారి- అహంకారమే ఆమె వ్యక్తిత్వం' అనే అర్ధం వచ్చేట్లు పోస్టర్ కి క్యాప్షన్ ఇచ్చాడు సుకుమార్. మొత్తానికి రంగమ్మత్త తర్వాత అనసూయకి మరో పవర్ ఫుల్ రోల్ ఇచ్చాడు సుకుమార్. పోస్టర్ చూస్తే ఆ సంగతి అర్ధమౌతుంది. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం, అటు అల వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు వున్నాయి. డిసెంబర్‌ 17న ఈ సినిమా తొలి బాగం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS