సినిమా పరిశ్రమ అంటేనే గాసిప్పుల మయం. ఓ హీరో.. ఓ హీరోయిన్ తో చనువుగా ఉంటే చాలు. వెంటనే వాళ్లిద్దరి మధ్యా ఏదో ఉందని గాసిప్పు పుట్టుకొచ్చేస్తుంది. ఓ దర్శకుడు ఓ హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేస్తుంటే... వాళ్లిద్దరూ రాసుకుపూసుకుతిరుగుతున్నారంటూ వార్తలు వండేస్తుంటారు. అఫ్ కోర్స్.. కొన్నిసార్లు ఈ ఎఫైర్లు నిజమే అయినా, నూటికి 90 సార్లు.. ఇవన్నీ పుకార్లుగా మిగిలిపోతున్నాయి. రవిబాబు - పూర్ణల మధ్య కూడా అలాంటి పుకార్లే వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్ లో ఓ అవును, అవును 2, లడ్డూబాబు సినిమాలొచ్చాయి. వరుసగా పూర్ణకే అవకశాలు ఇవ్వడంతో.. ఇద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తుందన్న వార్తలు మొదలయ్యాయి. వీటిపై.. రవిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తను ఎవరితోనూ ఎఫైర్లు పెట్టుకోలేదని, తాను సెట్లో చాలా ప్రొఫెషనల్ గా ఉంటానని, పేకప్ చెప్పేశాక... తాను ఎవరితోనూ టచ్ లోఉండనని, కనీసం అసిస్టెంట్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయనని చెప్పుకొచ్చాడు.
''నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎవరితోనూ రాసుకుపూసుకుని తిరగను. సినిమా షూటింగ్ అయిపోతే.. నాకంటూ ఓ లైఫ్ ఉంటుంది. హీరోయిన్లతో రాసుకుపూసుకుని తిరిగితే... వాళ్లు మరోసారి నన్ను రానిస్తారా? మరో సినిమా చేస్తానా? పూర్ణ మంచి నటి. కాబట్టే తనతో మూడు సినిమాలు చేశా'' అని క్లారిటీ ఇచ్చాడు రవిబాబు.