యాంకర్స్ అందు అనసూయ యాంకరింగ్ వేరయా.. అనాలి. ఏం క్రేజో తెలీదు కానీ, ఆంటీ అయినా ఆమెకున్నంత క్రేజ్ అంతకంటే హాట్ అండ్ యంగ్ అయిన రష్మి తదితర యాంకర్స్‌కు లేదనే చెప్పాలి. అనసూయ ఏం చేసినా అదో న్యూసే. అందుకే ఇటు బుల్లితెరపైనా, అటు పెద్ద తెరపైనా పెత్తనం చెలాయిస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ అనసూయ లెవలే వేరు. ఎప్పుడూ హాట్ హాట్‌గా న్యూస్‌లో వెలిగిపోయే అనసూయ తాజాగా మరోసారీ న్యూస్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం, ఆమె డ్యాన్స్ అండ్ డ్రస్సింగ్. లేటెస్ట్‌గా అనసూయ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ షోకి సంబంధించి, శేఖర్ మాస్టర్‌తో కలిసి చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది.
'బలపం పట్టి భామ ఒళ్లో..' అంటూ శేఖర్ మాస్టర్‌తో కలిసి వేసిన హాట్ హాట్ స్టెప్పులు ఇప్పుడు పెద్ద న్యూస్ అయ్యి కూర్చున్నాయి. అనసూయ ఏజ్ గురించి మాట్లాడితే ఆమెకు చాలా కోపమొస్తుంది. కానీ, ఆ వయసులోనూ, ఆ గ్లామర్ తళుకులు, నడుమొంపుల సొగసులు.. కుర్రకారులో క్రేజ్ చూస్తే, ఎంతటి వారికైనా అసూయ పుట్టక మానదు. అనసూయ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాసుకుని ఎదురు చూసే అభిమానులున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో.