ఎన్ని సక్సెస్‌లొచ్చినా, స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోతోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. 'సుప్రీమ్', 'తొలిప్రేమ', 'వెంకీ మామ', ప్రతిరోజూ పండగే'.. ఇలా వరుసగా చాలా సక్సెస్‌లు అందుకుంది రాశీఖన్నా. కానీ, ఎందుకో స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతోంది. అందుకే రాశీఖన్నా ట్రాక్ మార్చేసిందంటున్నారు. త్వరలో విడుదల కాబోయే విజయ్ దేవరకొండ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' లో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రాశీతో పాటు, మరో ముగ్గురు భామలు నటిస్తున్నా, రాశీ పాత్ర అందరికన్నా కీలకం అని తెలుస్తోంది. అంతేకాదు, రీసెంట్‌గా విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్‌లో రాశీఖన్నా పాత్ర బోల్డ్‌గా చూపించడంతో, రాశీ రూటు మార్చేసిందంటున్నారు.
సక్సెస్‌లొచ్చినా సరైన గుర్తింపు దక్కడం లేదు.. బోల్డ్‌గా కనిపిస్తే అయినా తనను గుర్తు పడతారనుకుందో ఏమో, ఈ సినిమా కోసం మరీ బోల్డ్ అవతారమెత్తేసింది. విజయ్‌తో ఘాటు ఘాటుగా లిప్‌లాక్స్, బ్యాక్ ఓపెన్ బోల్డ్ లుక్స్.. ఇలా శాంపిల్‌కే ఎన్నో చూపించేసింది. సినిమాలో రాశీఖన్నా ఇంకా ఎక్కువ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సినిమా హిట్ అయితే, అందరికన్నా ఎక్కువ పాపులారిటీ రాశీఖన్నాకే దక్కుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయినా విజయ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్స్ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంటుంటారు. షాలినీ పాండే, రష్మికా మండన్నా తదితర ముద్దుగుమ్మలు అలాంటి పాపులారిటీనే సంపాదించుకున్నారు. సో రాశీఖన్నా ప్లాన్ కూడా అదేనేమో. చూడాలి మరి, రాశీ ముచ్చట రౌడీ తీరుస్తాడో లేదో.!