గ్లామ్‌ షాట్‌: రెడ్‌ హాట్‌ రంగమ్మత్త

మరిన్ని వార్తలు

ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌ అనుకునే నైజం అనసూయ భరాద్వాజ్‌ది. అందుకే, బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.. సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. 'నేను పెళ్ళయిన మహిళని. నాకు ఇద్దరు పిల్లలున్నారు.. ఇద్దరు కొడుకులకి తల్లిని నేను..' అని గర్వంగా చెప్పుకునే అనసూయ, గ్లామర్‌ విషయంలో అస్సలేమాత్రం మొహమాటపడదు. 'నేను గ్లామర్‌ ప్రపంచంలో వున్నాను.. గ్లామరస్‌గా కన్పించడం అనేది నా వృత్తి పరంగా అవసరం..' అని చెబుతుంటుందామె.

 

ఇక, పై ఫొటో విషయానికొస్తే, అనసూయ రెడ్‌ హాట్‌ అవతార్‌లో అభిమానుల్ని కనువిందు చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా లక్షలాదిమంది ఫాలోవర్స్‌ని కలిగి వున్న అనసూయ, ఈ తరహా ఫొటో సెషన్స్‌తో తన అభిమాన గణాన్ని మరింత పెంచుకుంటోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ నెంబర్‌ ఫర్‌ అనసూయ. అస్సలేమాత్రం మేకప్‌ లేకుండా ఫొటోలు పోస్ట్‌ చేసినా.. కంప్లీట్‌ మేకప్‌తో ఫొటోలు పోస్ట్‌ చేసినా.. అనసూయకే చెల్లుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS