నాగబాబు ఎవర్ని ర్యాగింగ్‌ చేస్తున్నట్లు.?

By Inkmantra - December 07, 2019 - 15:10 PM IST

మరిన్ని వార్తలు

సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు సోషల్‌ మీడియా వేదికగా సంచలనాలకు తెరలేపారు. 'జుట్టు తెల్లబడ్డ ప్రతి ఎటు కానీ వాడు పెద్ద మనిషి అనుకొని భ్రమపడ్డా.. ప్రజలు నన్ను క్షమించాలి. ఆ పెద్ద మనిషి పేరు ఆచూకీ ఫొటో తెలిపినవారికి తగిన బహుమతి ఇవ్వబడును' అంటూ ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దానికి కొనసాగింపుగా నాగబాబు, కొన్ని ఫొటోల్ని పోస్ట్‌ చేశారు. అందులో ఓ వైట్‌ చింపాంజీ కన్పిస్తోంది. మరోపక్క, సదరు చింపాంజీ బార్సిలోనా జూ నుంచి తప్పించుకుందంటూ నాగబాబు అసలు విషయం చల్లగా సెలవిచ్చారు.

 

అయితే, జనసేన అభిమానులు మాత్రం ఆ ఫొటోలు వైఎస్సార్సీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని ఉద్దేశించినవంటూ నాగబాబు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఇంతకీ, నాగబాబు, విజయసాయిరెడ్డిని ర్యాగింగ్‌ చేస్తున్నట్లేనా.? అంటే, ఆ ప్రశ్నకు సమాధానం తెలియాల్సి వుంది. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై, విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్న విషయం విదితమే. దానికి జనసేన శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు నుంచి స్పందన ఇలా వచ్చిందని అనుకోవాలేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS