సుకుమార్ `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టింది అనసూయ. ఆ సినిమా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవొచ్చు. ఇప్పుడు `పుష్ష`లోనూ అలాంటి మంచి పాత్రనే అనసూయ కోసం సృష్టించాడట సుకుమార్. `పుష్ష`లో అనసూయ నటిస్తోందని, చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఓ సందర్భంలో అనసూయ కూడా `నేను ఆ సినిమాలో లేను` అని చెప్పింది. అయితే అనూహ్యంగా.. పుష్ష సెట్లో కనిపించింది అనసూయ.
హైదరాబాద్ లో `పుష్ష` షూటింగ్ జరుగుతోంది. బుధవారం.. అనసూయపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెకెక్కించార్ట. ఈ సినిమాలోనూ అనసూయ పాత్ర అదిరిపోతుందని, తనకు మరోసారి మంచి పేరు తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తనకు ఛాన్స్ రావడం పట్ల... అనసూయ కూడా చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు.. పుష్షకు గానూ అనసూయకు భారీ పారితోషికం కూడా ముట్టజెబుతున్నార్ట.