చిత్రసీమ చాలా విచిత్రమైనది. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్లయిపోవొచ్చు. ఓ సినిమా చాలామంది జీవితాల్ని మార్చేస్తుంది. `ఉప్పెన`లా. మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా ఇది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా కోసం బుచ్చికి పారితోషికం ఏమీ అందలేదు. నెల జీతం ప్రాతిపదికన పని చేశాడంతే. సినిమా హిట్టయి, డబ్బులు రావడంతో, బుచ్చికి ఖరీదైన కారు, ఫ్లాటూ.. బహుమానాలుగా అందేశాయి. ఇప్పుడు రెండో సినిమాకి ఏకంగా 10 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడట.
అవును.. బుచ్చిబాబుతో మైత్రీ మూవీస్ సంస్థ మరో సినిమాకి ఎగ్రిమెంట్ చేయించుకుంది. ఈ సినిమా కోసం ఏకంగా 10 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్టు టాక్. బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తాడని, అది మైత్రీలోనే అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి రూ.10 కోట్లు ఇస్తున్నార్ట. రెండో సినిమాకే ఇంత పారితోషికం తీసుకోవడం కూడా ఓ రికార్డే అంటున్నారు టాలీవుడ్ జనాలు.