ఆడదానికి చీరే అందం. ఆ చీరట్టుకు కాస్త సిగ్గు తోడైతే, ఆ వర్ణనే అద్భుతం కదా. అలాంటి అందమైన చీరకట్టులో సిగ్గులొలుకుతూ అలా వయ్యారంగా కెమెరాకి పోజిచ్చింది అందాల అనసూయ. అందరికీ కళ్లు జిగేలనేలా చేసింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకి గెస్ట్‌గా వెళ్లిన మన అందాల రంగమ్మత్త బిగ్ హౌస్‌లో సందడి సందడి చేసింది. హౌస్ మేట్స్ అందరికీ మెహందీ పెట్టి అందులో కూడా తన టాలెంట్ చాటుకుంది. హౌస్ మేట్స్‌తో కలిసి స్టెప్పులేసింది. అల్లరల్లరి చేసింది. నిండైన చీర కట్టులో చూసే ఆడియన్స్‌కి కనువిందు చేసింది. యాష్ అండ్ బ్లూ కలర్ శారీలో పోనీటెయిల్‌తో సింప్లీ సూపర్బ్ అనిపించింది. మేచింగ్ ఇయర్ రింగ్స్, సింప్లీ ఫింగర్ రింగ్ అనసూయ అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. టోటల్‌గా రంగమ్మత్త తనలోని అందాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిందిలా 'బిగ్‌బాస్' హౌస్‌లో.