అన‌సూయ‌ని వద‌ల‌ని సుకుమార్‌

By Gowthami - January 18, 2020 - 10:10 AM IST

మరిన్ని వార్తలు

కొంత‌మంది ద‌ర్శ‌కుల‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌. ఓ సినిమాలోని హిట్ ఫార్ములాని మ‌రో సినిమాలోనూ కొన‌సాగించాల‌ని చూస్తుంటారు. ప్ర‌స్తుతం సుకుమార్ అదే చేస్తున్నాడు. త‌న గ‌త సూప‌ర్ హిట్ చిత్రం `రంగ‌స్థ‌లం`లో విజృంభించిన న‌టించిన అన‌సూయ‌ని వ‌ద‌లడం లేదు. త‌దుప‌రి సినిమాలోనూ కొన‌సాగిస్తున్నాడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇది వ‌ర‌కే షూటింగ్ మొద‌లైంది. ఈ వారంలో రెండో షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఇందులో అన‌సూయ‌కు కూడా ఓ కీల‌క పాత్ర ద‌క్కింది. రంగ‌స్థ‌లంలోలానే ఇందులోనూ అన‌సూయ‌లోని మ‌రో కోణం బ‌య‌ట‌పెట్ట‌నున్నాడ‌ట సుక్కు. ర‌ష్మిక క‌థానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS