తమన్నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల 'సైరా నరసింహారెడ్డి'లో లక్ష్మి పాత్రలో నటించి మెప్పించింది. 'సైరా లక్ష్మి'గా తమన్నాకి మంచి పేరు తీసుకొచ్చింది ఈ పాత్ర. మెగాస్టార్‌ ప్రియురాలిగా నటించడంతో పాటు, కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చిందంటూ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఇది చాలదట. ఇంకా ఏదో చేయాలట. దశాబ్ధానికి పైగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలుతున్న బ్యూటీ తమన్నాకి అసలు సిసలు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇంతవరకూ తగలనే లేదట. అసలింతకీ తమన్నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా? హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలని. కానీ, చాలాసార్లు ఆ అవకాశాలు తమన్నా తలుపు తట్టాయి.

 

అయితే, ఆయా సినిమాల్లో పాత్రలు తనను మెప్పించలేదంటోంది అందాల తమన్నా. అలాంటి పాత్ర దొరికే వరకూ సినిమాలను విడిచి పెట్టేది లేదని చెబుతోంది. గతేడాది మొదట్లో 'ఎఫ్‌ 2'తోనూ, చివరిలో 'సైరా'తోనూ విజయాలందుకున్న తమన్నా ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌గా ఏ కొత్త ప్రాజెక్ట్‌పైనా సంతకం చేయలేదు. కానీ, 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో 'డాంగ్‌ డాంగ్‌' సాంగ్‌లో స్పెషల్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చి, అదరగొట్టేసింది. ఈ ఏడాదికి ఇలా బోణీ కొట్టిన తమన్నా ఈ ఏడాదైనా తన డ్రీమ్‌ నెరవేర్చుకుంటుందేమో చూడాలి మరి. మరోవైపు తమిళంలో ఓ సినిమాలోనూ, హిందీలో రెండు సినిమాలతోనూ తమన్నా బిజీగా ఉందిప్పుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS