అనసూయ పనే బాగుంది. అటు టీవీ షోలూ, ఇటు ఐటెమ్ గీతాలు అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. బుల్లి తెరపై అనసూయ బిజీ యాంకర్. వెండి తెరపైనా తన సోయగాల్ని.. చూపిస్తూ - మాస్‌ని ఆకట్టుకుంటోంది. తాజాగా.. `ఖిలాడీ`లో మరో ఐటెమ్ గీతం తో అలరించడానికి రెడీ అయ్యింది. రవితేజ నటిస్తున్న చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకుడు. ఈసినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించడానికీ, ఐటెమ్ గీతంలో నర్తించడానికి అనసూయని ఎంచుకున్నారు.
ఖిలాడీ ఆట మార్చే గేమ్ ఛేంజర్ గా..... అనసూయ పాత్ర ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. దాంతో.. అనసూయ పాత్రకు ఈ కథలో ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవొచ్చు. కార్తికేయ నటిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమాలోనూ అనసూయ ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తోంది. 3 నిమిషాల ఈ పాట కోసం అనసూయ 20 లక్షలు డిమాండ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. మరి ఖిలాడీ దగ్గర ఎంత లాగిందో??