బుల్లితెర హాటెస్ట్ యాంకర్ అనసూయ చుట్టూ ఏవో రూమర్స్ తిరుగుతూనే ఉంటాయి. ఆ రకంగా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ న్యూస్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడిపై ఓ రూమర్ నడుస్తోంది. అనసూయ బరువు పెరిగిపోయిందనీ, ఆ బరువుని అదుపులో ఉంచుకోలేక సర్జరీని ఆశ్రయిస్తోందనీ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కొన్ని చోట్ల అనసూయకి వ్యతిరేకంగా చాలా దుష్ప్రచారం జరిగింది. రాయడానికి వీల్లేని పదాలతో అనసూయ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రచారం పట్ల అనసూయ కలత చెందింది. అందుకు ఆమెకి చాలా కోపమొచ్చేసింది కూడా. అయినప్పటికీ సంయమనం పాటించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఖండించింది. సర్జరీలను ఆశ్రయించే ప్రసక్తే లేదని చెప్పింది అనసూయ. బుల్లితెరపై సూపర్బ్ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న అనసూయ, వెండితెరపైనా వెలిగిపోతోంది. ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేనివారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారనుకోవచ్చు. అయినా బరువు పెరగడం, తగ్గడం అనేది వారి పర్సనల్ ఇష్యూ. అయినా కానీ సెలబ్రిటీస్ అన్నాక పర్సనల్స్ తెలుసుకోవడానికి కూడా ఆడియన్స్ ఇలాగే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. గాసిప్స్ రావడం వేరు, హీరోయిన్ల శరీరంలోని వివిధ భాగాల గురించి పనిగట్టుకని దుష్ప్రచారం చేయడం వేరు కదా. అందుకే ఈ విషయంలో అనసూయ అంత గట్టిగా స్పందించి ఉంటుంది. అయ్యో హాట్ బ్యూటీకి కోపమొస్తే ఎంత ప్రమాదం సుమీ!