ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన బాహుబలి చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఓ ధియేటర్ లో విషాదం జరిగింది.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్ లోని అంబా ధియేటర్ లో బాహుబలి 2 ప్రదర్శింపబడుతున్నది. అయితే నిన్న మధ్యాహ్నం మ్యాట్నీ షో నడుస్తున్న సమయంలో చిత్రాన్ని వీక్షిస్తున్న ముబాశీర్ అహ్మద్ అనే వ్యక్తి గుండెపోటుకి గురై మృతిచెందాడు.
దీనితో ధియేటర్ వారు వెంటనే పోలీసులకి సమాచారం అందివ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం మార్చురికి తరలించారు.
ఒక్కసారిగా ఇలా జరగడంతో ప్రేక్షకులు అంతా భయాందోళనలకి గురయ్యారట.