'రంగమ్మత్త' రూటు మార్చింది

By iQlikMovies - March 30, 2018 - 11:01 AM IST

మరిన్ని వార్తలు

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌గా అనసూయా భరద్వాజ్‌ పేరు ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మోత మరింత ఎక్కువైంది. దీనికంతటికీ కారణం 'రంగస్థలం' సినిమానే. ఈ సినిమాలో అనసూయ పోషించిన 'రంగమ్మత్త' పాత్రనే. ఈ సినిమాలో హాట్‌ హాట్‌ రంగమ్మత్తగా అనసూయ వయ్యారాలు పోయింది. ఇక ఈ తాజా ఫోటో విషయానికి వస్తే, ట్రెండీ అండ్‌ మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తోంది. 'రంగస్థలం' ప్రెస్‌ మీట్‌లో ఇదిగో ఇలా తళుక్కున మెరిసింది. రంగస్థలంలో పల్లెటూరి కట్టు బొట్టులో కనిపించిన అనసూయ ఇలా ట్రెండీ లుక్‌తో క్యూట్‌గా మారిపోయింది. అనసూయ కెరీర్‌లో 'రంగస్థలం' ది బెస్ట్‌ మూవీ అంటోంది. ఈ పాత్ర పోషించాక, ఇలాంటి పాత్రలు భవిష్యత్తులో కూడా తాను నటించగలనన్న నమ్మకం కుదిరిందని చెబుతోంది అనసూయ. ఈ రోజు 'రంగస్థలం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెస్పాన్స్‌ ఆకాశాన్నంటేస్తోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS