'రంగస్థలం'కి పైరసీ టెన్షన్‌.?

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ మెగా పవర్‌ ప్యాక్‌ 'రంగస్థలం' మరి కొన్ని గంటల్లో ధియేటర్స్‌లో సందడి చేయనుంది. అంతకన్నా ముందే ప్రివ్యూ షోలు పడనున్నాయి. ఎక్కడెక్కడ ప్రివ్యూ షోలు పడతాయా అని మెగా అభిమానులు గాలింపులు మొదలెట్టేశారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్స్‌తో ధియేటర్స్‌ అన్నీ పవర్‌ ప్యాక్‌డ్‌ అయిపోయాయి. మరో పక్క ఈ సినిమాకి పైరసీ టెన్షన్‌ మొదలైంది. 

ఫస్ట్‌లుక్‌కి ముందే రంగస్థలాన్ని లీకుల బెడద వెంటాడింది. ఫస్ట్‌లుక్‌ రాకుండానే, సమంత ఫోటోలు లీకయ్యాయి. దాంతో చిత్ర యూనిట్‌ అప్రమత్తమైంది. అది మినహా ఇంతవరకూ ఎలాంటి లీకుల గోల లేదు. కానీ ఒక్కసారి ప్రివ్యూస్‌ స్టార్ట్‌ అయ్యాయంటే, విత్‌ ఇన్‌ సెకన్స్‌లో పైరసీలు స్టార్ట్‌ అయిపోతాయి. అదే చిత్ర యూనిట్‌కి ఆందోళన కలిగిస్తున్న విషయం. కాగా రామ్‌చరణ్‌, సమంత తొలిసారి జోడీ కడుతున్న సినిమా ఇది. అందులోనూ, ఇద్దరికీ ఈ సినిమాలోని పాత్రలు ఛాలెంజింగ్‌ పాత్రలు కావడంతో, ఇటు మెగా అభిమానులు, అటు సమంత అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మెలోడీ, అండ్‌ ఫోక్‌ సంగీతం సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఎక్కడ విన్నా 'రంగస్థలం' పాటలే, ఎక్కడ చూసినా 'రంగస్థలం' గురించి చర్చలే. అంతగా 'రంగస్థలం' ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక 'రంగమ్మా మంగమ్మా..' పాటకు వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. ఈ పాటకు వివిధ రకాల స్టైల్స్‌లో డాన్సులు కంపోజ్‌ చేస్తూ, ఆ వీడియోలను నెట్టింట్లో వదిలేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS