న్యూ ఇయర్ రోజు ఎవరైనా విషెస్ చెప్తారు కానీ బూతులు తిడుతూ ఫైర్ అయ్యింది అనసూయ. బుల్లి తెర యాంకర్ గా వచ్చిన పాపులారిటీ తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అనసూయ. నటనతో కంటే కూడా, హాట్ ఫొటో షూట్లతో, తన డ్రెస్ లతో, వివాదాలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఎప్పుడూ ఎదో ఒక వివాదం తో వార్తల్లో ఉండే అనసూయ న్యూ ఇయర్ రోజు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అనసూయ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా, క్షణాల్లో వివాదాలతో వైరలవుతుంది. అయినా వెరవదు, పోకిరి గాళ్ళకి, తనని టార్గెట్ చేసేవాళ్ళకి అంతే ధీటుగా ఆన్సరిస్తుంది.
ఇంతకీ న్యూ ఇయర్ రోజు బూతు దండకం ఎందుకు అంటే '2023 లో నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే మీకు మంచిగా అయ్యింది. 2024లో కూడా నేను ఇలానే ఉంటా. నా జోలికి వస్తే దూల తీర్చి, దూపం వేస్తా, అంటూ ఒక డబ్‌స్మాష్ వీడియోను షేర్ చేసి ఇండైరెక్ట్ గా ఘాటు వార్నింగ్ ఇస్తూ ‘‘నేను జోక్ చేస్తున్నా. సీరియస్ కాదు’’ అంటూ వీడియో కింద క్యాప్షన్‌ను కూడా పెట్టి తన ఇనిస్టా లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ అవాక్కు అయ్యారు. కానీ అనసూయ బూతులు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొత్త సంవత్సరంలో కూడా ఇలాగే ఉంటానని క్లారిటీ ఇవ్వటం తో చాలా మంది అనసూయ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అనసూయ ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ చిత్రంతో పాటు ‘పుష్ప పార్ట్ 2’లో కూడా నటిస్తోంది.