అనసూయని అలా ఆడి పోసుకుంటారెందుకు?

మరిన్ని వార్తలు

ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 'నిజమైతే తప్పు దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో' అనే డైలాగ్‌ని పోస్ట్‌ చేసింది అనసూయ. ఇది 'రంగస్థలమ్‌' సినిమాలోని డైలాగ్‌. ఈ సినిమాలో అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్‌ రాసిన డైలాగ్‌ ఇది. ఇలాంటి డైలాగ్స్‌ రాయడంలో ఆయన దిట్ట. అంతేకాదు ఆ డైలాగ్‌తో సినిమాలో సీన్‌ని అంతే గొప్పగా రక్తి కట్టించడంలోనూ ఆయనకి ఆయనే సాటి. ఈ డైలాగ్‌కి సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందట. అంతేకాదు, చాలా బలమైన సన్నివేశంలో ఈ డైలాగ్‌ చెప్పిస్తాడట సుకుమార్‌. అయితే అవేమీ చెప్పకుండా, ఈ డైలాగ్‌ని సింపుల్‌గా 'రంగస్థలమ్‌' అనే హ్యాష్‌ టాగ్‌తో పోస్ట్‌ చేసింది అనసూయ. అయితే ఈ డైలాగ్‌కి సోషల్‌ మీడియాలో రివర్స్‌ కౌంటర్లు పడిపోతున్నాయి అనసూయకి. నెటిజన్లు ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గాసిప్స్‌పై అనసూయ చాలా ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. అందుకే నెటిజన్లు ఇలా స్పందించి ఉంటారు. ఏదేమైనా ఈ డైలాగ్‌ అయితే చాలా బాగుంది. కానీ డైలాగ్‌ని డైలాగ్‌లా చూడకుండా, నెటిజన్లు ఆమెకి కౌంటర్స్‌ ఇవ్వడం బాగోలేదనే చెప్పాలి. అనసూయ ఏం చేసినా వివాదంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు సోషల్‌ మీడియాలో కొంత మంది. ఇదో వికృత చర్యగా మారిపోయింది. అవకాశాలు వరదలా వచ్చి పడుతున్నా చాలా సెలెక్టివ్‌గానే అనసూయ సినిమాలు ఎంచుకుంటోంది. ఆ విషయంలో అనసూయని అభినందించాల్సిందే.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS