సూపర్ స్టార్ 'రజనీకాంత్' కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రోబో. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటే, అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శంకర్ ఈ సినిమాని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని ప్రచారం లో వుంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కథ లీకైందంటూ కోలీవుడ్ లో టాక్ వినపడుతుంది. రోబో 2.0 స్టోరీ లోకి వెళ్తే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ కి పక్షులంటే పిచ్చి ప్రేమ. ప్రపంచంలో ఎన్నో రకాలైన పక్షులని పెంచుకుంటూ ఉంటాడు. ఓ దశలో పక్షులు అనూహ్యంగా ఒకదాని తర్వాత ఒకటి చనిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటని ఆరాతీస్తే ఒక కఠోర నిజం తెలుస్తుంది.
ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ విస్తరించటం వల్ల, మూగజీవాలు అంతరిస్తున్నాయన్న నిజం తెలుసుకుంటాడు. ముఖ్యంగా పక్షిజాతి అంతరించిపోవటానికి కారణం, టెక్నాలకీ అని తెలుసుకొని, దానిపై తన యుద్ధం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలోనే ప్రపంచంలోని సైంటిస్టుల్ని, సాంకేతికతను నాశనం చేయాలని ఎదురు తిరుగుతాడు. కథలో అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది.
ఒక మంచి పని కోసం అక్షయ్ దృష్టశక్తిగా మారే క్రమంలో, అది సైంటిస్టు రజనీ కి తలనొప్పిగా మారుతుంది. అతడు అప్పటికే సంఘంలోని అవినీతిని అంతం చేసేందుకు ఒక రోబో ను కనిపెడతాడు. ఆ రోబో ను నాశనం చేయాలని అక్షయ్ ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అక్షయ్, రజనీ ల మధ్య యుద్ధం ఎలా మొదలైంది, ఎలా చివరి దశకు చేరిందనేది అసలు స్టోరీ.
ఈ కథలో ఎమీ జాక్సన్ పాత్ర ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అక్షయ్, రజనీ, అమీ ల చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. ఇక ఈ కథని విజువల్ వండర్ గా తీర్చి దిద్ధేందుకు దర్శకుడు శంకర్ తన శక్తి కి మించి కష్టపడుతున్నాడు.