యాంకర్ నుండి నటిగా మారిన అనసూయ ఈ మధ్యన పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలో కనిపిస్తూ మంచి నటిగా దూసుకుపోతుంది. ఇక అదే క్రమంలో మోహన్ బాబు, విష్ణు నటించిన గాయత్రి చిత్రంలో ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది అనసూయ.
ఇక నిన్న జరిగిన గాయత్రి ప్రీ-రిలీజ్ వేడుక లో అనసూయ మాట్లాడే సమయంలో నటుడు మోహన్ బాబు గారిని బాబుగారు అని సంబోధించగా ఆ విషయాన్ని మోహన్ బాబు మాట్లాడే సమయంలో నువ్వు నన్ను బాబుగారు అని అన్నావా లేక బావగారు అని అన్నావా అని అడగడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అంతకుముందే విష్ణు మాట్లాడుతూ- అనసూయని ఇదే అంశం పైన అడుగుతూ- మా అమ్మ ఇక్కడే ఉంది, నువ్వు మా నాన్నని బావగారు అని పిలిస్తే ఎలా అంటూ విష్ణు కూడా అనసూయని ఆట పట్టించాడు. దీంతో నిన్న జరిగిన ఈవెంట్ లో అందరూ బావగారు.. బావగారు అంటూ అనసూయని ఏడిపించడం జరిగింది.
మొత్తానికి అనసూయ బావగారి కామెంట్ నిన్నటి ఈవెంట్ లో హాట్ టాపిక్ అయింది.