గ్లామ్‌షాట్‌: 'ఎద' మాటున దాగిన పచ్చ'బొమ్మ'

మరిన్ని వార్తలు

'పచ్చబొట్టేసిన అందగాడా నీతో పడుచు ప్రాయాలనే పంచుకుంటానురా..' అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా, 'బాహుబలి' సినిమాలో ప్రబాస్‌తో చేసిన రొమాన్స్‌ రచ్చ రంభోలా సంగతి తెలిసిందే. ఆమె ఎదపై.. ఎదపై కాదులెండి.. బాహుబలిగా ప్రబాస్‌ వేసిన పచ్చబొట్టు అవంతికా ఎదలో ప్రేమ గంటలు మ్రోగించింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇక ఈ పచ్చబొట్టు వివరాల్లోకి వచ్చేస్తే, అనసూయా భరద్వాజ్‌. పరిచయమే అక్కర్లేని పేరిది. అందాల భామలంతా అసూయ చెందే గ్లామర్‌ అది. చూస్తున్నారుగా, ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాలో సెగలు పుట్టించే అనసూయ, తాజాగా ఇదిగో ఈ టాటూను ఎక్స్‌పోజ్‌ చేస్తూ కొత్త హీటు పుట్టిస్తోంది.

 

ఎదపై వేయించుకున్న ఈ టాటూను సుతారంగా చూపిస్తూ, తెగ మురిసిపోతోంది. నిజానికి అనసూయ ఒంటిపై చాలానే టాటూలున్నట్లున్నాయి. ఇప్పటికైతే చేతిపై ఒకటి, ఎదపై ఇంకొకటి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. పెద్దగా టెన్షన్‌ పడనవసరం లేదులెండి. మూడొచ్చినప్పుడు అనసూయే విప్పి చూపిస్తుంది. అబ్బే.. డబుల్‌ మీనింగ్‌కెళ్లొద్దండీ బాబూ. టాటూ తీసి చూపిస్తుందని అర్ధం. ఇప్పటికైతే వీటిలో సరిపెట్టుకోండి. త్వరలో ఈ టాటూ బ్యూటీ 'కథనం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS