తమన్నా ని అడ్డంగా బుక్ చేసిన మరో తమన్నా..!

మరిన్ని వార్తలు

తమన్నా ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా మారు మ్రోగుతుంది. ఈమె హీరోయిన్ తమన్నా కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి. ఒకరు పెద్ద సెలబ్రిటీ, ఇంకొకరు సెలబ్రిటీ కాని సెలబ్రిటీ...కానీ వాళ్ళిద్దరికీ ఒకే పేరు ఉంటే, అవే పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉంటే.. వాళ్ళ ఫాన్స్ కి, క్రిటిక్స్ కి ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒకరిని పొగడబోయి మరొకర్ని పొగుడుతుంటారు.. పొగిడితే పెద్దగా ప్రాబ్లెమ్ లేదు.. కానీ తిడితేనే రియాక్షన్ వేరేలా ఉంటుంది..ఎవ్వరికి చెప్పుకోవాలో ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్ధం కాని పరిస్థితి.. అనవసరపు టెన్షన్ ఇప్పుడు ఇదే పరిస్థితి, మన మిల్కీ బ్యూటీ తమన్నాకు ఎదురైంది.

 

తమన్నాకు ఈ మధ్య ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే భయమేస్తోందట. దానికి కారణం మా టీవీ లో ప్రసారమయ్యే కాంట్రవర్సియల్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో మొదలయ్యి దాదాపు 3 వారాలు కావొస్తుంది. మొదటి వారం ఎలిమినేషన్ లో షోలోని 15 మంది కంటెస్టెంట్స్ లో హేమని పంపించేసి ట్రాన్స్ జెండర్ 'తమన్నా సింహాద్రి' ని హౌస్ లోనికి ఆహ్వానించారు. ఇక్కడినుండి మొదలయ్యింది హీరోయిన్ తమన్నా కి తలనొప్పి.

 

వచ్చిన మొదటి రోజు మినహా, ప్రతి రోజు ఏదో ఒక గొడవ చేసి అసభ్యకరమైన పదజాలంతో ఇతర కంటెస్టెంట్స్ ని దూషిస్తూ, షో ని భ్రష్టు పట్టించ్చిందని ప్రేక్షకులు ఏకిపారేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లో తమన్నా సింహాద్రిని ట్రోల్ చేయటానికి మన మిల్కీ బ్యూటీ తమన్నా ని టాగ్ చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కి ఇదో పెద్ద సమస్యగా మారింది. బిగ్ హౌస్ నుండి తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యేవరకు మిల్కీ బ్యూటీ తమన్నాకి ఈ తిప్పలు తప్పేలా లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS