సంపాదన అంటే... సినిమాల్లోనే. కాసేపు తెరపై మెరిస్తేచాలు.. లక్షలు వచ్చి పడిపోతాయి. క్రేజ్ ఉన్నవాళ్లకు క్యాష్ చేసుకునే అద్భుతమైన అవకాశం సినిమానే కల్పిస్తుంది. ఒక్క ఐటెమ్ పాటలో.. నర్తిస్తే... కోటి రూపాయలు ఇచ్చిన సందర్భాలున్నాయి. `ఆచార్య`లో జస్ట్ 20 నిమిషాలు కనిపించడానికి పూజా హెగ్డే కోటి రూపాయలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అనసూయ ఏం తక్కువ తినలేదు. 4 నిమిషాల పాటకు ఏకంగా 20 లక్షలు డిమాండ్ చేసిందట.
విన్నర్' ‘ఎఫ్-2’ చిత్రాల్లో ఐటెంసాంగ్స్లో మెరిసింది అనసూయ. ఇప్పుడు మరో ప్రత్యేకగీతంలో కనిపించబోతున్నది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ఐటెమ్ గీతం ఉంది. అందుకోసం అనసూయని సంప్రదిస్తే 20 లక్షలు డిమాండ్ చేసిందట. అనసూయకి అంత క్రేజ్ వుంది మరి. అందుకే అడిగినంత ఇచ్చి.. సంతకాలు కూడా చేయించుకున్నారు. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందట.