ఏంటో.. టాప్ హీరోయిన్లని మించిపోతోంది అనసూయ. పారితోషికాల విషయంలో. ఓ షో లో పాల్గొంటే.. రోజుకి కనీసం లక్షరూపాయలు సంపాదిస్తుంది అనసూయ. అదీ బుల్లి తెరపై ఆమెకున్న క్రేజ్. వెండి తెరపై తనేమీ తక్కువ వసూలు చేయడం లేదు. ఇక్కడ డబుల్ రేటు గిట్టుబాటు అవుతోంది. ఆమధ్య `చావు కబురు చల్లగా`లో ఓ పాటలో నర్తించినందుకు ఏకంగా 15 లక్షలు ఇచ్చార్ట. తీరా చూస్తే.. ఈ పాటకు కేవలం 3 రోజుల కాల్షీట్లే ఇచ్చింది.
ఇప్పుడు `థ్యాంక్యూ బ్రదర్`కీ బాగానే గిట్టుబాటు అయ్యిందని టాక్. త్వరలోనే ఆహాలో ఈసినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ద్వారా పాతిక లక్షలు రాబట్టిందట అనసూయ. రోజువారీ పారితోషికం లెక్కన ఈ సినమాకి పనిచేసిందట. రోజుకి లక్షన్నర చెప్పున 17 రోజుల్లో.. పాతిక లక్షలు రాబట్టింది. ఈ సినిమాకి నైట్ షిఫ్టుల్లోనే ఎక్కువ పనిచేసిందట అనసూయ. డే టైమ్ అంతా బుల్లి తెరకు కేటాయించింది. అంటే ఈ 17 రోజులూ.. రెండు చేతులా ఆదాయం సంపాదించిందన్నమాట. అనసూయా.. మజాకా..