సోషల్ మీడియాలో అనసూయ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుండడం కామనే. ఆ సెక్సీ పిక్స్‌తోనే హాటెస్ట్ యాంకర్‌గా అంత పాపులర్ అయ్యింది అనసూయ. ఇకపోతే ఇలా సెక్సీ పిక్స్ పోస్ట్ చేస్తున్నందుకు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ వేస్తూ కొంతమంది అభిమానులు ట్రాలింగ్ చేస్తున్నారు.
యాంకరింగ్‌లో ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ చేయని సుమ బెస్ట్ యాంకర్‌గా పాపులర్ అయ్యింది. మరి నువ్వెందుకు ఆ డిగ్నిటీని మెయింటైన్ చేయవు.? ఆ డ్రస్సులేంటీ? ఆ ఎక్స్‌పోజింగ్ ఏంటీ.? అంటూ నెగిటివ్ కామెంట్స్‌తో ఓ వర్గం అభిమానులు అనసూయని దుమ్మెత్తి పోస్తుండగా, మరోవైపు ఆమె డ్రస్సు ఆమె ఇష్టం. ఎందుకు ఆమెను అలా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఓ యాంకర్ అన్న మాట మర్చిపోతున్నారు మీరు.. అంటూ మరో వర్గం అభిమానులు ఆమెను సపోర్ట్ చేసేలా పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇలా అనసూయ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమె ధరించే దుస్తుల గురించి ఒకరిపై ఒకరు దాదాపు కొట్టుకునే రేంజ్‌లో వాదులాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలోనే అనసూయ తన డ్రస్సింగ్ గురించి కామెంట్స్ చేయవద్దని, తన డ్రస్సు తన ఇష్టమనీ, నేనెలా ఉండాలో నాకు తెలుసు. అసవసరంగా కామెంట్ చేయడానికి మీరెవరు..? సినిమాల్లో హీరోయిన్స్ కొంతమంది ఎక్స్‌పోజింగ్ లేకుండానే పాపులర్ అవుతున్నారు. కొంతమంది ఎక్స్‌పోజింగ్‌తోనే పాపులర్ అవుతున్నారు. వారిని కామెంట్ చేయని మీరు నన్ను ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి ఘాటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా నెగిటివిటీతో కూడా పాపులారిటీ దక్కించుకోవడం అనసూయ స్పెషాలిటీ.