విజయ్ దేవరకొండ విషయంలో పదే పదే వివాదాల్లోకెక్కుతోంది బుల్లితెర సెన్సేషన్ అనసూయ భరద్వాజ్. కొన్నాళ్ళ క్రితం ఓ సినీ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని అనసూయ ప్రశ్నించడంతో ఆమెపై బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. మళ్ళీ తాజాగా విజయ్ దేవరకొండకి సంబంధించిన విషయంలోనే తన ఆవేదనను ప్రస్తావించినందుకు అనసూయని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. దీంతో అనసూయ మరోసారి సీరియస్‌గా స్పందించాల్సి వచ్చింది. ‘హేటర్స్ పట్ల నేను వర్రీ అవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే, నేను చెబుతున్న నిజాన్ని నమ్మలేక అబద్ధం అనే ప్రపంచంలో వాళ్ళంతా బతుకుతున్నారు’ అని అనసూయ తనదైన స్టయిల్లో కామెంట్ చేసింది.
‘రైజ్ అండ్ షైన్’ అంటూ అనసూయ హ్యాష్‌ట్యాగ్ కూడా జత చేసింది. అంతే, అనసూయని మరోసారి చాలా సీరియస్‌గా, నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేస్తున్నారు. జుగుప్సాకరమైన తిట్లతో విరుచుకుపడుతున్నారు. పదే పదే తనపై జరుగుతున్న ఈ తరహా ట్రోలింగ్‌పై అనసూయ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నా ప్రయోజనం వుండడంలేదు. ‘నా ప్రయత్నంలో నేనెప్పుడూ వెనుకంజ వేసే ఛాన్సే లేదు. నా పోరాటం నిజం కోసం..’ అని ఇప్పటికే పలుమార్లు అనసూయ స్పష్టం చేసిన విషయం విదితమే. ఇక, కెరీర్ విషయానికొస్తే.. అటు బుల్లితెరపై అనసూయ హవా కొనసాగుతూనే, ఇటు వెండితెరపైనా ఈ బ్యూటీ హంగామా కొనసాగుతూనే వుంది.
There is more that’s happening in the world than that meets the eye..how else will we all realise we have to protect each other..as one big family..sans gender,language,stature,caste,creed, borders..Please..please for once and the next..drop the blame games..the hatred..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 7, 2020