బికినీ వేస్తారా? అనగానే.. హీరోయిన్లు కాస్త ఆలోచిస్తారు. వాళ్లకు మనసులో బికినీ వేయాలనే ఉంటుంది. కానీ ఎలాంటి విమర్శలు వస్తాయో అని భయం. పైగా ఇంట్లోవాళ్లు ఎలా స్పందిస్తారో అనే ఆందోళన. కానీ స్వయంగా హీరోయిన్ తల్లి.. `నువ్వు బికినీ వేయ్.. ఏం కాదులే` అని ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది..? రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో అదే జరిగింది. రకుల్ హీరోయిన్ కాకముందు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. రకుల్ కెరీర్‌కి అది చాలా దోహదం చేసింది.
కాకపోతే... మిస్ ఇండియా రూల్స్ వేరుగా ఉంటాయి. అక్కడ నెగ్గుకురావడం అంత సులభం కాదు. ముఖ్యంగా బినికీ లాంటి దుస్తుల్ని వేసుకోవాల్సివస్తుంది. ఇదే విషయం రకుల్ అమ్మతో చెప్పింది. కానీ రకుల్ మాతృమూర్తి మాత్రం `మరేం ఫర్వాలేదు.. బికినీ వేయ్...` అంటూ ప్రోత్సహించారు. అమ్మ ఇచ్చిన ధైర్యంతో రకుల్ బికినీలో ముస్తాబైంది. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మర్చిపోలేనని, వాళ్లవల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.