బుల్లితెర సంచలనం అనసూయ, కోలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది. 'సిల్క్ స్మిత' లాంటి పాత్రలో కన్పించబోతోందన్నది తాజా ఖబర్. ఈ మేరకు అనసూయ ఓ ఫొటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, తమిళంలో అనసూయ ఏ సినిమా చేస్తోందన్నదానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. విజయ్ సేతుపతి సరసన నటించబోతోందంటూ ఓ గాసిప్ బయటకు వచ్చింది. దీనిపైనా అనసూయ ఇంతవరకు స్పందించలేదు.
అయితే, నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్నీ, అందునా సినిమాలో తన పాత్రకు ఎక్కువ వెయిట్ వున్న పాత్రల్ని మాత్రమే అనసూయ ఎంచుకుంటుంటుంది. అలాంటి ప్రత్యేకమైన పాత్రలకు తమిళ సినిమాల్లో స్కోప్ కనిపిస్తుంటుంది. అందుకే, అనసూయకి కోలీవుడ్ పెర్‌ఫెక్ట్ వేదిక.. అంటున్నారు ఆమె అభిమానులు. సిల్క్ స్మితని గుర్తుకు తెచ్చే పాత్రలో అయినా, రాణించగల సత్తా అయితే అనసూయకి వుంది.
ఇదిలా వుంటే, తమిళంలో అనసూయకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయనీ, ఓ సినిమాలో అనసూయ నెగెటివ్ రోల్‌లో కూడా కనిపించబోతోందని అంటున్నారు. ఏమో, ఈ ప్రచారంలో నిలజమెంతోగానీ, కలర్స్ స్వాతి, రీతూ వర్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తెలుగు భామలు, తెలుగు సినిమాల్లో కంటే, తమిళ సినిమాలతోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సాధించిన దరిమిలా, అనసూయ కూడా వారెవ్వా.. అనిపించుకునే పాత్రలతో తమిళనాట స్థిరపడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.