చిరంజీవి - కొరటాల శివ కాంబో లో వస్తున్న సినిమా `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కనిపించనున్నాడు. ఫ్లాష్ బ్యాక్‌లో చరణ్ ఎపిసోడ్ చాలా కీలకమని సమాచారం. చరణ్ పక్కన ఓ కథానాయిక కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న విషయంలో ఆసక్తి కరమైన చర్చ కూడా నడుస్తోంది. సమంతకి ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారని చెప్పుకున్నారు. `రంగస్థలం` తరవాత.. ఈ కాంబో తెరపై కనిపిస్తుందని అనుకున్నారు. అయితే చివరికి రష్మిక పేరు ఖరారు చేసినట్టు సమాచారం అందుతోంది.
రష్మిక అయితే చరణ్‌తో కాంబినేషన్ పరంగానూ కొత్తగా ఉంటుందని, పైగా రష్మిక సూపర్ ఫామ్ లో ఉందని, అది సినిమాకీ ప్లస్ పాయింట్ అవుతుందని కొరటాల భావిస్తున్నాడట. చరణ్ కూడా సమంత కంటే.. రష్మికనే బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నాడని తెలుస్తోంది. చరణ్ త్వరలోనే సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. చరణ్ తో పాటు రష్మిక కూడా ఎంట్రీ ఇస్తుందని, వీళ్లిద్దరి మధ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం అందుతోంది. సో.. చరణ్ - రష్మిక కాంబో ఓకే అయిపోయినట్టే.